కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారుల దౌర్జన్యం

.భారత్ న్యూస్ హైదరాబాద్….కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారుల దౌర్జన్యం

కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ గ్రామంలో ఉద్రిక్తత

వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు

రిజర్వు ఫారెస్టులో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం

రైతు శంకర్ కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం

తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం పై రైతు శంకర్ ఆగ్రహం

మేము 60 ఏండ్ల నుండి భూమి సాగు చేస్తున్నామని.. మాకు రైతు బంధు కూడా పడుతుందని అప్పుడు మమ్మల్ని ఎవరు ఆడుకోలేదని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతుల ఆవేదన…