భారత భూభాగంలోకి చొరబడిన పాక్ డ్రోన్లు.. సైన్యం కాల్పులు….

భారత్ న్యూస్ నెల్లూరు..భారత భూభాగంలోకి చొరబడిన పాక్ డ్రోన్లు.. సైన్యం కాల్పులు….

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్, సాంబా సెక్టార్లలో పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించిన డ్రోన్లను భారత సైన్యం గుర్తించి కాల్పులు జరపడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనతో సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు జారవిడవడానికి ప్రయత్నించి ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ అన్ని భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసింది….