శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం!

.భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం!

శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం!
తెలంగాణ : హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం రన్ వే పైకి రాగానే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. HYD నుంచి ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే స్పందించి.., రన్ వే పైనే విమానాన్ని నిలిపి వేశారు.టేక్ ఆఫ్ అవ్వకముందే లోపం బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.