భారత్ న్యూస్ ఢిల్లీ….ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ!: ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ నిర్ణయంతో ప్రజలు ఓటర్ కార్డు తీసుకోవడం సులభతరం అవుతోంది.
కొత్త ఓటరు దరఖాస్తులతో పాటు ఉన్న పాత వాటిలో మార్పులు కూడా ఓటర్ల జాబితా పూర్తయిన 15 రోజుల్లోనే ఇస్తామని తెలిపింది.
దీని కోసమే తమ ఐటీ మాడ్యూల్‌లో కీలక మార్పులు చేశామని పేర్కొంది..