భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం–ECMS కింద కేంద్ర ప్రభుత్వానికి 1,15,351 కోట్ల రూపాయల పెట్టుబడి విలువ గల దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈరోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం కింద దరఖాస్తు తేదీ నిన్నటితో ముగిసిందని అన్నారు. పెద్ద సంఖ్యలో ఈ పథకం కింద పెట్టుబడి దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
