39 కోట్ల గంజాయి పట్టివేత.

భారత్ న్యూస్ విశాఖపట్నంరూ.39 కోట్ల గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న రూ.39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అరెస్ట్ చేశారు. నిందితులు ఈ గంజాయిని ముంబైలోని డ్రగ్ నెట్వర్క్కి సరఫరా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.