ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల గణన

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల గణన

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో జనగణన తొలి దశగా ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతి రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ప్రక్రియను కనీసం 30 రోజుల పాటు నిర్వహిస్తారు.

వాస్తవానికి జనగణన 2021లో జరగాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

ఈసారి జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు.

తొలి దశ:2026 ఏప్రిల్ – సెప్టెంబర్ 🏘️ హౌస్ లిస్టింగ్

రెండో దశ: 2027 ఫిబ్రవరి జనగణన పూర్తి

హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలు సేకరిస్తారు.

వచ్చే ఏడాది జరగనున్న జనగణనలో జనాభా వివరాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేయనున్నారు.

ఇది దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనగా నిలవనుంది.