భారత్ న్యూస్ రాజమండ్రి…వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2700 కోట్లను తక్షణం చెల్లించండి. వెంటనే సమ్మెను విరమింపజేయండి.
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు YSR దేవుడైతే..
పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు గారు రాక్షసుడు అవుతున్నారు.
ఆరోగ్యశ్రీ పై కూటమి ప్రభుత్వం చేస్తున్నది మహా కుట్రలు.
పథకం నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ప్రైవేటు ఆరోగ్య బీమా ముసుగులో.. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారు.
రూ.2700 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగం.
ఏడాదిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండు సార్లు సమ్మెకు దిగినా..
బిల్లులు చెల్లింపుపై పట్టింపు లేదంటే ప్రజారోగ్యంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది.
నెల రోజులుగా ఓపీ సేవలు నిలిపివేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం అత్యంత దారుణం.
వైద్య సేవలు పునరుద్ధరించకపోవడం ఆరోగ్యశ్రీపై ప్రభుత్వానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం.
పేదల ఆరోగ్య ప్రధాత ఆరోగ్యశ్రీ. దివంగత నేత డాక్టర్ YSR మానసపుత్రిక ఈ పథకం.
ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా.
ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించడం దారుణం.
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయడం సహించరాని చర్య.
ఎన్నికల్లో చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారు.
ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టారు.
రూ.2.5 లక్షలు దాటితే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద ఇస్తారట. పేదల ఆరోగ్యం విషయంలో ఇంత నాటకం ఎందుకు ?
పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు ?
ప్రైవేటుకు లాభం కోసం ప్రభుత్వ పథకాన్ని చంపాలా?
ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4 వేల కోట్ల కేటాయింపుకి మనసు రాని ప్రభుత్వానికి,
ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎలా వస్తాయి ?
ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దానికన్నా.. బీమా కంపెనీలకు ఇచ్చేది తక్కువనా ?
దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయి.
ప్రైవేట్ బీమా భారం తప్పా లాభం కాదని ఒప్పుకున్నాయి.
ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.
వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.

ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపండి.