ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బిటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ 6 ఏళ్ల బిటెక్ కోర్సులో 2025 – 26 సం.లో ప్రవేశానికి పదవ తరగతి పాసైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

IIIT క్యాంపస్ లు

నూజివీడు (ఏలూరు జిల్లా)

ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ, వైఎస్ఆర్ జిల్లా)

ఒంగోలు (ప్రకాశం జిల్లా)

శ్రీకాకుళం (శ్రీకాకుళం జిల్లా)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 27, 2025 ఉదయం 10:00 గంటలకు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: మే 20, 2025 సాయంత్రం 5:00 గంటలు.

దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్: www.rgukt.in లేదా AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా.

దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులు: ₹300

రిజర్వ్ చేయబడిన వర్గాలు: ₹200

ఇతర రాష్ట్రాల అభ్యర్థులు: ₹1000

రిజర్వేషన్ విధానాలను అనుసరించి, పదవ తరగతిలో మెరిట్ మరియు అర్హత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.