భారత్ న్యూస్ విజయవాడ..రేపు టెన్త్ హాల్టికెట్లు విడుదల
మనమిత్ర వాట్సప్ లో డౌన్లోడ్ కు అవకాశం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల హాల్టికెట్లు రేపు టెన్త్ హాల్టికెట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కె.వి. శ్రీనివాసు లురెడ్డి వెల్లడించారు. అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in, ‘మన మిత్ర’ వాట్సప్ నంబరు 9552300009, పాఠశాల విద్యాశాఖ లీప్ యాప్ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. లేదంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని తెలిపారు. ఎస్ఎస్సీ హాల్ టికెట్లు పంపిణీకి, డౌన్లోడ్ కు బోర్డు ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీకి, థర్డ్ పార్టీ వెబ్సైట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఇలాంటి వాటి ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చెయ్యవద్దని విద్యార్థులకు సూచించారు.
