భారత్ న్యూస్ విజయవాడ…తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త
AP: తల్లికి వందనం పథకం పెండింగ్ నిధులు
విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని స్పష్టం చేశారు. దీంతో దాదాపు రూ. 325 కోట్ల నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి. పేదరికం కారణంగా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.
