ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

నాగర్కర్నూల్లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) నిన్న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది