భారత్ న్యూస్ విజయవాడ…నరసరావుపేటలో ఘనంగా బాలల దినోత్సవం

Ammiraju Udaya Shankar.sharma News Editor…శంకర భారతిపురం హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ.ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు.
నరసరావుపేట లింగంగుంట్ల శంకర భారతిపురం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) CSR ఫండ్స్ ద్వారా ప్రతిభ కనబరచిన 15 మంది విద్యార్థులకు కొత్త సైకిల్స్‌ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ
“బాలల దినోత్సవం అంటే కేవలం సంబరాలు మాత్రమే కాదు, బాలల భవిష్యత్తును బలోపేతం చేసే సందర్భం కూడా అని అన్నారు. చదువులో, క్రీడల్లో, కళలలో ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులు సైకిళ్లు బహుకరించారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి కూటమి నాయకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ , సిబ్బంది పాల్గొన్నారు.
