భారత్ న్యూస్ డిజిటల్; అమరావతి:
నెల్లూరు నగరము, రంగనాయకులపేటలో వేంచేసియున్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము నందు ఉదయం 9.00 గంIIలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు నవాబ్ పేట బుజ్జమ్మ తోట వరకు భోగి తోట ఉత్సవం అత్యంత వైభవముగా జరిగినది. తదుపరి 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా “మన సంస్కృతి సాంప్రదాయం” ప్రతిబింబించే విధంగా తేది. 13-01-2026న మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు దేవస్థాన కల్యాణ మండపము నందు ముగ్గుల పోటీలు నిర్వహించబడినది. అనంతరం భక్తులు, సిబ్బందితో దేవస్థానము వద్ద భోగి మంటలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు
