టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం,

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీకి 18 క్లీనింగ్ యంత్రాలు విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 22: కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) లో భాగంగా IDBI బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను ఆదివారం విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈఓ శ్రీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ శ్రీ రామకృష్ణ కు యంత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ శ్రీ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ శ్రీ దూడల రాజేష్ పాల్గొన్నారు.