అనతి కాలంలోనే చల్లపల్లి ప్రజల అభిమానాన్ని పొందిన… ఎస్సై కేవైదాస్

భారత్ న్యూస్ రాజమండ్రి…అనతి కాలంలోనే చల్లపల్లి ప్రజల అభిమానాన్ని పొందిన… ఎస్సై కేవైదాస్

చల్లపల్లి:
చల్లపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టి నెలన్నరలోపే తన విధి నిర్వహణతో, పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకున్నారు బదిలీపై వెళ్ళనున్న చల్లపల్లి ఎస్సై కే. వై.దాస్. చల్లపల్లి మండలంలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఆ హెచ్చరికలకు కట్టుబడి ఎవరికి లొంగకుండా ఎక్కడ బరులు ఏర్పాటు చేయకుండా చూడటంలో విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఎస్ ఐ కే వై దాస్ పందెం రాయుళ్లపై పైచేయి సాధించాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతి సామాన్యులకు కూడా దగ్గరే వారి ప్రేమను పొందుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నినాదాన్ని నిజం చేసి అందరికీ దగ్గరయ్యారు కెవైదాస్. నవంబర్ 19 2025న చల్లపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కూడా పట్టుమని పనిచేయకుండానే ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. నీతిగా.. నిజాయితీగా.. సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ఎవరికి… ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, ఆటంకాలను అధిగమించి అందరినీ కలుపుకుంటూ చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించడంలో ఆయన పనితీరు అందరిని ఆకట్టుకునేలా చేసింది. చల్లపల్లి ఎస్సైగా దాసుగారే కొనసాగితే బాగుండు అని సామాన్యుడు సైతం కోరుకోవటమే ఎస్ ఐ కే వై దాస్ పనితీరుకు నిదర్శనం. బిల్డర్ బాడీతో పైకి గంభీరంగా కనిపించినప్పటికీ మౌనంగా తన పని తాను చేసుకోవడం, అవసరమైన మేరకే ఎవరితోనైనా మాట్లాడటం ఆయన నైజం. కంకిపాడుకు బదిలీపై వెళ్లనన్న కేవై దాసుకు చల్లపల్లి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. కేవై దాస్ స్థానంలో దుర్గాంజనేయులు ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్నారు.