శ్రీకాకుళం జిల్లా పోలీసు
భారత్ న్యూస్ డిజిటల్:శ్రీకాకుళం:
“సంక్రాంతి పండుగ దృష్ట్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ll
ll చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడద్దు.ll
ll సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన.ll
శ్రీకాకుళం: జనవరి 13.
రానున్న సంక్రాంతి పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లు పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమైన కూడళ్లులో ఆటోలలో మైక్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో పండుగను ఆసరాగా చేసుకుని జరిగే కోడి పందేలు, పొట్టేలు పందేలు, జూదం ఆటలు, డొక్కాటలు, పిక్కాటలు, అలాగే అసభ్యకరమైన నృత్య ప్రదర్శనలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిషేధించడమైనదని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చట్టాన్ని ఉల్లంఘించి నేరస్తులుగా మారి తమ భవిష్యత్ జీవితాలను పాడు చేసుకోవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
పండుగ వేళల్లో దొంగతనాలు, మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుపోయే సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, నగదు మరియు ఇతర వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు.
అలాగే పండుగకు స్వగ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకోవాలని, అవసరమైతే బ్యాంక్ లాకర్లు లేదా ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండుగకు వెళ్లే ముందు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే, పోలీసులు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేస్తారని తెలిపారు.

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి,పండుగను ఆనందంగా, శాంతియుతంగా, భద్రంగా జరుపుకోవాలని శ్రీకాకుళం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.