భారత్ న్యూస్ మంగళగిరి.పోక్సో కేసులో నిందితుడికి సహకరించిన నిందితుడి అమ్మ, అమ్మమ్మని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించిన సౌత్ డీఎస్పీ శ్రీమతి భానోదయ గారు
16 సంవత్సరాల మైనర్ అమ్మాయికి మాయ మాటలు చెప్పి, పెళ్లి చేసుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి, సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితుడికి సహకరించారు అతని అమ్మ, అమ్మమ్మను కూడా అరెస్ట్ చేసిన సౌత్ డీఎస్పీ గారు.
పోక్సో చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం పోక్సో కేసులో నేరానికి పాల్పడిన నిందితుడికి ఏ శిక్ష వర్తిస్తుందో, అదే శిక్షకు సహకరించిన వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసిన గుంటూరు సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు.
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళాయపాలెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు, అదే గ్రామములోనీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తమ మైనర్(16 సంవత్సరాలు) అమ్మాయి ది.14.10.2025 తేదీ సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత ఇంటికి రాలేదని, ఎంత వెదికినా ఆమె కనిపించలేదని, వారి అమ్మాయిని వెతికి అప్పగించాలని, చర్యలు తీసుకున్న ది.15.10.2025న పోలీస్ వారికి ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసి, నల్లపాడు సీఐ వంశీధర్ గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది.
వెంటనే నమోదు చేసిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోక్సో కేసుగా మార్చి ఆ సెక్షన్ల ప్రకారం సౌత్ డీఎస్పీ శ్రీమతి భానోదయ గారు దర్యాప్తు జరిపారు కేసులో ప్రధాన నిందితుడైన గంగపతి బన్నీని ది.20.10.2025న అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసులో నిందితుడికి అతని స్నేహితుడితో పాటు అతని అమ్మ, అమ్మమ్మలు కూడా సహకరించినట్లు తెలియడంతో ఈరోజు(15.11.2025) నిందితుని అమ్మ, అమ్మమ్మను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడి స్నేహితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చేపట్టడం జరుగుతుంది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం పోక్సో కేసులో నేరానికి పాల్పడిన నిందితుడికి ఎటువంటి శిక్ష వర్తిస్తుందో అటువంటి శిక్షే అతనికి సహకరించింది కూడా వర్తిస్తుందని డిఎస్పీ గారు చెప్పారు
