జూద క్రీడలు వద్దు-సాంప్రదాయ క్రీడలే ముద్దు..!

భారత్ న్యూస్ రాజమండ్రి…జూద క్రీడలు వద్దు-సాంప్రదాయ క్రీడలే ముద్దు..!
🌟🌟
కోడూరు:రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో జూద క్రీడలు వద్దని, సాంప్రదాయ క్రీడలే ముద్దని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. శనివారం కోడూరు శివారు స్వతంత్ర పురం తదితర ప్రాంతాలలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ నిబంధనలకు, చట్ట విరుద్ధ కార్యక్రమాలు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల సహకారం అవసరమని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియపరచాలని ఎస్సై కోరారు.