కరీంనగర్ బస్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రంలో తనిఖీలు*

భారత్ న్యూస్ డిజిటల్:తెలంగాణ:

*కరీంనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత :

కరీంనగర్ బస్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రంలో తనిఖీలు*

తనిఖీల్లో పాల్గొన్న పోలీసు జాగిలం – లియో

​కరీంనగర్: కమీషనరేట్ ప్రజల రక్షణ, శాంతిభద్రతలు, మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు.

​దీనిలో భాగంగా, నగరంలోని రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృతస్థాయిలో, పోలీసు జగిలాలతో తనిఖీలు, ప్రధాన కూడళ్ళలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను గుర్తించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు.

ఈ భద్రతా చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712670744 ‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనరేట్ కి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.