భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు తెలిపిన ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
◆సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది.
◆ తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వండి.వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం.
◆ ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలే తప్ప,పక్కింటి వారికి తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దు.
◆మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిది.
◆ నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్/ సెక్యూరిటీ గార్డ్/ సర్వెంట్ గా నియమించుకోవాలి.
◆ సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి
◆ మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్/ ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.
◆ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కట్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి.
◆ ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.ఇంటి ముందు చెత్త చెదారం,న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది.
◆ మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయండి.
◆ ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని సీపీ తెలిపారు..
