జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారత్ న్యూస్ డిజిటల్:మచిలీపట్నం:

జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు గారు, అడిషనల్ ఎస్పి ఏఆర్ సత్యనారాయణ గారు, ఇతర పోలీసు అధికారులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈసందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ…

ఎందరో మేధావులు, త్యాగధనుల కృషిఫలితమే మనకు 1950 జనవరి 26 న అతి పెద్ద రాజ్యాంగం ఏర్పడిందన్నారు. అప్పటి నుండి ప్రతీఏటా ఈరోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బంది సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారితో సంభాషించారు.

అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి, వివిధ విభాగ సిబ్బందికి మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.