భారత్ న్యూస్ రాజమండ్రి…మెడికల్ కాలేజీల నిర్మాణంలో PPP విధానంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది: దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి
అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య విద్య ప్రమాణాలను అసాధారణ స్థాయిలో పెంచడానికి ఉద్దేశించిన కీలకమైన ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు బుధవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ PPP అంటే ప్రైవేటీకరణ కాదని ఇది కేవలం ప్రభుత్వానికి, ప్రైవేట్ రంగానికి మధ్య ఒక సమర్థవంతమైన భాగస్వామ్యం మాత్రమేనని స్పష్టం చేశారు.కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని, విద్యార్థులకు ఫ్రీ సీట్లు యథావిధిగా ఉంటాయని పేర్కొన్నారు మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా సీట్లు మరియు ఫీజుల నియంత్రణ విషయంలో ఎటువంటి మార్పు ఉండవని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది వైద్యారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన వేగంగా జరగడానికి, నిధుల సమీకరణ కోసం ఈ విధానం అవసరమని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం 17 కాలేజీలు కట్టామని చెప్పుకోవడం అవాస్తవమని, కేవలం 17% మాత్రమే ఖర్చు పెట్టిందని, కొన్ని కాలేజీల్లో కనీసం సిబ్బంది, హాస్టళ్లు కూడా లేవని, అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పర్చూరి దుర్గాప్రసాద్,బండే రాఘవ,ఘంటసాల రాజమోహన రావు,దాసినేని శ్రీనివాసరావు,బచ్చు రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు
