ఏపీలో అరుదైన ఘట్టం.. ఒకేరోజు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన భార్యాభర్తలు..

భారత్ న్యూస్ మంగళగిరి…𖥔 ఏపీలో అరుదైన ఘట్టం.. ఒకేరోజు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన భార్యాభర్తలు..

A. Udaya Shankar.sharma News Editor…అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అరుదైన ఘట్టం నిన్న చోటుచేసుకుంది. ఒకే రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్లా బాధ్యతలు స్వీకరించగా, ఆయన సతీమణి కృతికా శుక్లా ప‌ల్నాడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరూ ఆనందంలో మునిగిపోయారు.

2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈ దంపతులు వరుసగా ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందినవారు. వీరిద్దరూ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్లుగా, హెచ్ఒడిలుగా, వివిధ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు యువ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమించిన సందర్భంలో ఈ అరుదైన పరిణామం చోటు చేసుకుంది.