కాపుల ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణ.

నాగాయలంక

కాపుల ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

శ్రీ కృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం నాగాయలంక మరియు కాపునాడు అవనిగడ్డ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ వారి తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాగాయలంకలో వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఐక్యంగా ఉంటేనే కాపుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
గతంలో కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు స్వర్గీయ వంగవీటి మోహనరంగా అండగా నిలబడే వారిని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆయన ఆశయాలు కనుగొనంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
కాపులలో ఉన్న అన్ని వర్గాలు ఐక్యంగా ఉండాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కాపు సంఘం జేఏసీ నాయకులు చందు జనార్దన్ రావు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, అవనిగడ్డ కాపు సంఘం అధ్యక్షులు భోగాది సోమశేఖర్, కాపు నాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రమణ్యం, జనసేన పార్టీ నాయకులు బెస్ట్ హాస్పిటల్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, కమతం సాంబశివరావు, రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు సంకట లక్ష్మణ రావు, జనసేన పార్టీ పామర్రు నాయకులు మంటాడ విజయ్, పెనమలూరు జనసేన పార్టీ నాయకులు కొండవీటి ఈశ్వర్ రావు, స్థానిక కాపు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.