భారత్ న్యూస్ గుంటూరు…ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్. పి. మరియు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో మొత్తం 12 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఒక డీవీసీఎం, బెటాలియన్ నెంబర్ 2కు చెందిన ఇద్దరు, పీపీసీఎం ఒకరు, ఏసీఎం ఇద్దరు, పార్టీ సభ్యులు ఇద్దరు, పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం రూ.54 లక్షల నగదు రివార్డు ఉంది. వీరిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు…
