భారత్ న్యూస్ విజయవాడ…టీడీపీ ఎమ్మెల్యే లపై ఆరోపణలకు నేరుగా ఫిర్యాదు చేసే విధానం..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రత్యేక ఫోన్ నంబర్‌తో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేకమైన ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు.
ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచి, ఎమ్మెల్యేలపై గానీ అధికారులపై గానీ వచ్చే ఆరోపణలను నమోదు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ విధానంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి, నిజానిజాలు నిర్ధారించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకైనా, అధికారులపై వచ్చిన ఫిర్యాదులకైనా ఒకే విధమైన ప్రమాణాలతో విచారణ జరపనున్నారు.

ఈ కొత్త పథకానికి సంబంధించిన పూర్తి రూపకల్పనను నారా లోకేష్ త్వరలోనే ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు.