భారత్ న్యూస్ విజయవాడ…ప్రమాదంలోకి నెడుతున్న ‘10 నిమిషాల్లో డెలివరీ’స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో రైల్వే స్టేషన్ వద్ద ‘ఆన్‌బోర్డ్ డెలివరీ’ కోసం ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టాడు.

కదులుతున్న రైలు నుంచి దిగుతూ..ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాడు. తాజాగా జరిగిన ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీనికంతటికీ కారణం ‘10 నిమిషాల్లో డెలివరీ’ అనే విధానమే