త్వరలో AC బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం: ఆర్టీసీ ఎండీ

భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో AC బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం: ఆర్టీసీ ఎండీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…త్వరలో స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.

తాడిపత్రిలో ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయిస్తామన్నారు.

స్త్రీ శక్తి పథకంతో రోజూ లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని అన్నారు.