భారత్ న్యూస్ అనంతపురం…ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు
📍పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు.
ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం.
నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి.
అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి.
గోశాలల నిర్మాణంతో పశుసంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.
జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది.
పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది.
దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం.
అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి.
అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంభించాలి.
సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే… ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉంది. రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్, నాన్ జోన్ కింద విభజించారు.
నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలి.
ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ.
ఆక్వా కల్చర్‌ను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలి.
వ్యవసాయం చాలా ముఖ్యం. వ్యవసాయంలో 35శాతం గ్రోత్ రేట్ ఉంది.
సమస్యలను ఇప్పుడు మ్యానేజ్ చేయలేకపోతున్నారు.
యూరియా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసి పంపిణీ చేస్తే అది సమస్యనే కాదు.
ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి… నేను ఇచ్చిన ఐడియా అనుగుణంగా యూరియాపై ప్రయత్నించాలి.
సర్వీస్ సెక్టార్‌ను కూడా బాగా మేనేజ్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు.
జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.
ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని సూచించారు.
యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ప్రకటించారు.
విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
మైక్రో ఇరిగేషన్‌పై 30 ఏళ్లకు ముందు దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయికు రిపోర్టు ఇచ్చానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
దీంతో 90 శాతం మైక్రో ఇరిగేషన్ మనకు ఇచ్చారు.
కాఫీ పంటలో పెప్పర్ కూడా అంతర పంటగా వేయించాం.
కాఫీ కన్నా పెప్పర్ ఆదాయం ఎక్కువ ఉంది.
ఉల్లిపాయల విషయంలో వైసీపీ ఎన్నో డ్రామాలు ఆడుతోంది. ఉల్లిపాయలకు ఇప్పుడు రూ.12లు తగ్గకుండా చూడాలని చెప్పాం. కొన్ని సీజన్‌లలో ఇబ్బందులు వచ్చినా కల్టివేషన్ ప్లస్ వస్తే చాలు.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఓ సెక్రటరీనే ఉంచాం.
హర్టీకల్చర్‌పై లక్షా 70 వేల కోట్ల రూపాయల జీఎస్డీపీ వస్తోంది.

హస్బెండరీ ఓ గేమ్ చేంజర్. ఇది పేదవాళ్లను ఎంపవర్ చేయగలిగే స్కీమ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.