భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తయినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఈ పథకం కింద సామాన్యులకు రూ.78,000 వరకు సబ్సిడీ అందుతుంది. బీసీలకు అదనంగా రూ.20,000, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్ ప్యానెళ్లు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే సమయంలో విద్యుత్ రంగ ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
