వైసీపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం.

భారత్ న్యూస్ నెల్లూరు..వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సోదరి షర్మిలకు మధ్య రాజీ కుదిరిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల జగన్ పై విమర్శలు తగ్గించడం కూడా ఈ అను మానాలకు కారణమని చెప్పాలి. గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని, చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…త్వరలో వైయస్ షర్మిల వైసీపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగు తుంది, కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని షర్మిలను తప్పించే కాపు నేతకు పిసిసి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రియాంక గాంధీ ఇప్పటికే ఏపీలోని కాపు నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తుంది,

కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల వైదొలిగితే అది ఆమెకు అవమానకరమని అందుకే ఆమె జగన్ వైపు చూస్తూ చూస్తున్నారని గుసగుసలు వినవస్తున్నాయి.త్వరలోనే జగన్ కుటుంబ సభ్యులుం దరూ కలసి పోతారన్న టాక్ కూడా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి.

రాజకీయంగా విడిపోయి, ఆస్తుల విషయంలో విభే దాలు తలెత్తిన నేపథ్యంలో ఎవరూ పొలిటికల్ గా ఎదగలేకపోయారన్న భావన ఇరువురిలోనూ నెలకొందని అంటున్నారు అందుకే వైఎస్ సన్నిహితు లైన కొందరు సీనియర్లు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వారు వైఎస్ కుటుంబాన్ని ఏకం చేయాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా పనిచే స్తున్నట్లు తెలుస్తుంది..

అందుకే ఇటీవల జగన్ పుట్టిన రోజు నాడు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలపడం, దానికి జగన్ కూడా థ్యాంక్యూ అమ్మా అంటూ రిప్లై ఇవ్వడాన్ని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

కుటుంబ విభేదాలు పక్కన పెట్టి, వారసత్వ పోరును కొద్ది రోజులు ఆవల నెట్టి, ముందు రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహి తులు సూచించారని, అలాగే వైఎస్ కుటుంబం లోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్క రించారంటున్నారు. అంతా ఒకే అయితే త్వరలోనే దీని పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్లు ఒక్కటయి నట్లేనని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతుండటం విశేషం. మరి ఇందులో వాస్తవమేంతన్నది చూడాలి మరి!