భారత్ న్యూస్ రాజమండ్రి….అంగన్వాడీల్లో ఫేషియల్ రికగ్నిషన్
అంగన్వాడీల్లో ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు సాధనాలతో లబ్దిదారులను ధ్రువీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశించింది.

జూలై 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అదే తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంది.
పోషణ్ ట్రాకర్ ద్వారా ముఖ గుర్తింపు సాధనం అందుబాటులోకి వస్తుంది. ఈ-కేవైసీ, సొంత ఫొటో ద్వారా లబ్దిదారులు తమకు తాముగా నమోదు చేసుకోవచ్చు.
ఆగస్టు 1 నుంచి కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ కు ముఖ గుర్తింపు తప్పని సరి కానుంది.