భారత్ న్యూస్ గుంటూరు….వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్
AP: రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో ఇవ్వాల్సిన రేషను జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారు. రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి సరకులు అందించడంలో డీలర్లు చొరవ చూపించాలన్నారు.
