భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. …ఏపీలో ఇక రేషన్ డోర్ డెలివరీ బంద్????
అమరావతి :
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనసాగింపుపై ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టినట్టు సమాచారం.ఈ సేవలను కొనసాగించాలా, లేదా అనే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల రేషన్ డీలర్లు, MDU ఆపరేటర్లతో సమావేశం అవ్వగా వేర్వేరు అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో తుది నిర్ణయాన్ని వారం రోజుల్లో తీసుకుంటామని ఆయన తెలిపారట. గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఈ సేవలు 2027 జనవరి వరకు కొనసాగాలని ఎండియూ ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
