విమానాల రద్దు నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో 89 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

భారత్ న్యూస్ గుంటూరు….విమానాల రద్దు నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో 89 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.  రైలు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ తో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నామని తెలిపింది.

సెంట్రల్ రైల్వేలో, పూణే నుండి బెంగళూరు, పూణే నుండి ఢిల్లీ,  ముంబై నుండి ఢిల్లీ వంటి మార్గాల్లో 14 ప్రత్యేక రైళ్ల సేవలను, పశ్చిమ రైల్వేలో, భివానీ నుండి ముంబై , ముంబై నుండి షకుర్‌బస్తీ వంటి అనేక మార్గాల్లో ఏడు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.