భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ రాష్ట్రంలో 7.5 కి.మీ. రైల్వే సొరంగం
నెల్లూరు-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణాదిలోనే అతి పొడవైన రైల్వే సొరంగం ఉంది.
రూ.2 వేల కోట్లతో ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వరకు 113 కి.మీ. రైల్వేలైన్ను 2019లో నిర్మించారు.
ఇందులో భాగంగా చిట్వేలి, రాపూర్ మండలాల్లోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రూ.470 కోట్లతో నిర్మించారు.

ఈ మార్గంలో చెరువులు, వంకలు దాటడానికి 15 పెద్ద వంతెనలు, 120 చిన్న వంతెనలను నిర్మించారు.