ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు..!

మచిలీపట్నంకు చెందిన రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదిక మీద కనిపించడం నగర ప్రజలకు ఆసక్తి కలిగించింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని వీరిరువురు రాజకీయ ప్రత్యర్థులు. నిత్యం ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచే వీరు బుధవారం సాయంత్రం స్థానిక నిర్మల హైస్కూల్ లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఒకే వేదిక మీద కనిపించారు. వీరిద్దరూ ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు కావడం విశేషం.