భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్
అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులో వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. శుక్రవారం విచారణకు హాజరుకాని మాధవ్‌పై న్యాయమూర్తి వారంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు…
