భారత్ న్యూస్ విజయవాడ…రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు
ఆంధ్ర ప్రదేశ్ :
కర్నూలు వ్యవసాయమార్కెట్లో ఉల్లి ధరలు పాతాళం వైపు పయనిస్తున్నాయి. రైతుల వద్ద క్వింటాను మార్క్ ఫెడ్ రూ.1,200కు కొనుగోలు చేయగా నిల్వలు పెరిగి పోయాయి. కొత్త సరకు వస్తే దించుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ వద్ద ఉన్న స్టాకును కొనాలని వ్యాపారులను మార్క్ ఫెడ్ కోరింది. తొలుత ఆసక్తి చూపని వ్యాపారులు ఆపై నాణ్యతను బట్టి క్వింటా రూ. 50 నుంచి రూ.450 వరకు కొన్నారు. 800 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయి
