జూన్ 15లోపు తల్లికి వందనం డబ్బులు: హోంమంత్రి

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…జూన్ 15లోపు తల్లికి వందనం డబ్బులు: హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా ఉద్దండపురంలో మాట్లాడుతూ, స్కూళ్లు రీ-ఓపెన్ అయిన తర్వాత జూన్ 15, 2025 లోపు ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తామని ఆమె తెలిపారు.