భారత్ న్యూస్ రాజమండ్రి….శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలోని మొగలి పూల నుంచి తీసే నూనె లీటర్ ధర రూ.9 లక్షలు
సుగంధాల్లో రారాణిగా పిలుచుకునే మొగలి పూల నుంచి తీసే నూనె లీటర్ ధర రూ.9 లక్షలు పలుకుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సముద్రతీరంలో 6,000 హెక్టార్లలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఒక్కో చెట్టుకు ఏడాదికి 13 వరకు పూలు వస్తాయి. ఒక్కో పువ్వు ధర రూ.30-100 వరకు ఉంటుంది. 15 వేల పూలను బట్టీల్లో వేసి మరిగిస్తే లీటరు నూనె వస్తుంది. ఈ నూనెను వ్యాపారులు.. పర్ఫ్యూమ్ల తయారీకి రష్యా, చైనా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు….
