భారత్ న్యూస్ అనంతపురం….ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముఖ్యాంశాలు:
అమరావతి :
- కాలపరిమితి ముగింపు
1వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2021లో జరిగాయి.
వాటి ఐదు సంవత్సరాల పదవీకాలం 02-04-2026న ముగియనుంది.
- సంవిధాన నిబంధన
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం, గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఐదు సంవత్సరాల గడువు పూర్తయ్యే ముందు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాలపరిమితి ముగియకముందే జరగాలి అని స్పష్టం చేశారు.
- ప్రభుత్వ భాధ్యతలు
ప్రభుత్వం నిర్వహించవలసిన ఎన్నికల ముందు పనులు:
గ్రామపంచాయతీలు, వార్డుల పునర్విభజన (Delimitation).
ప్రజా సంకల్ప వేదిక డిమాండ్ …..రిజర్వేషన్ల ఖరారు (BCలకు Triple Test Formula ప్రకారం)
గ్రామపంచాయతీల విలీనం/నగరపాలక సంస్థలుగా అప్‌గ్రేడ్ చేయడం.
రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగలదు.
- ప్రజా సంకల్ప వేదిక పరిశీలన మేరకు గత సమస్యలు
2021లో 331 గ్రామపంచాయతీలకు చట్టపరమైన మరియు పరిపాలనా కారణాలతో ఎన్నికలు జరగలేదు.
ఈసారి 2026 ఎన్నికలతో సమకాలీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
- ప్రాథమిక షెడ్యూల్ (Pre-Election Schedule)
అక్టోబర్ 15, 2025లోపు: గ్రామపంచాయతీ విలీనం/అప్‌గ్రేడ్ ప్రతిపాదనలు.
నవంబర్ 15, 2025లోపు: ఓటరు జాబితా తయారీ & ప్రచురణ.

నవంబర్ 30, 2025లోపు: పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు & Ballot/EVMలు సిద్ధం చేయడం.
డిసెంబర్ 15, 2025లోపు: రిజర్వేషన్ల ఖరారు. ప్రజా సంకల్ప వేదిక డిమాండ్
జనవరి 2026: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం.
👉 అంటే, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్ 2026కి ముందే పూర్తి చేయాలి, అందుకోసం ప్రభుత్వం తక్షణమే ముందస్తు పనులు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది
