లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే నేను టీడీపీ తో ఏం చర్చిస్తాను నన్ను గెలకొద్దు ఇ రిటేట్ చెయ్యదు : విజయసాయి రెడ్డి

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే నేను టీడీపీ తో ఏం చర్చిస్తాను నన్ను గెలకొద్దు ఇ రిటేట్ చెయ్యదు : విజయసాయి రెడ్డి

వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయిరెడ్డి అని జగన్ ఆరోపణలు చేశారు.
ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని విమర్శించారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

” నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిస మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా భాద్యత తీసుకుని ఉందేవాదినేమో.

కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ?

అవును.. నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావుగారి ఇంటికి వెళ్ళా నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయం లో టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబుగారినే కలుస్తాకానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు.

లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు.