రాష్ట్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు…