దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు – ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరట

భారత్ న్యూస్ గుంటూరు….దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు – ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరట

ట్రూడౌన్ అమలుతో యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు… వేల కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది :దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు

అవనిగడ్డ: ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని, ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల హామీలను మాత్రమే కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందని అన్నారు.గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యుత్ రంగం అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడిందని విమర్శించారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదని, ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగమని పేర్కొన్నారు. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పుల పాలుచేసి, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చారని ఆరోపించారు.

2019లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని గుర్తు చేశారు. అయితే జగన్ రెడ్డి ప్రమాణ స్వీకార రోజున విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారు రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని అన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫలితంగా రూ.1.29 లక్షల కోట్ల అప్పులు మిగిలాయని తెలిపారు.2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారని, అధికారంలోకి వచ్చిన తరువాత వేల కోట్ల రూపాయల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించిందని తెలిపారు.

2019–2024 కాలానికి సంబంధించి రూ.4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఈఆర్సీ లేఖ రాసినప్పటికీ, ఆ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైనప్పటి నుంచి తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం కూటమి ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితమేనని తెలిపారు.ట్రూడౌన్ అమలుతో విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు 13 పైసలు తగ్గించడం దేశంలోనే తొలిసారి జరిగిందని చెప్పారు. అలాగే జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతుల నుంచి యూనిట్‌కు రూ.3.50 వసూలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్‌కు రూ.1.50కి తగ్గిస్తూ రైతులకు భారీ ఊరటనిచ్చి గారు తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, విద్యుత్ రంగంలో తీసుకుంటున్న ఈ సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,పర్చూరి దుర్గా ప్రసాద్,బండే రాఘవ,దాసినేని శ్రీనివాసరావు,బళ్ల ప్రసాద్,ముప్పరాజు సందీప్,చిరివెళ్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు