భారత్ న్యూస్ అనంతపురం.ఆకాశ మార్గంలో గిరిజన గూడేలకు ‘డ్రోన్’ వైద్యం!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల కొండ కోనలకు ఇప్పుడు వైద్యం ‘రెక్కలు’ కట్టుకుని రాబోతోంది.
అత్యవసర సమయంలో మందులు అందక, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడే గిరిజన బిడ్డలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక అద్భుతమైన ముందడుగు వేసింది.
పాడేరు వేదికగా సరికొత్త చరిత్ర!
దట్టమైన అడవులు, ఎగుడుదిగుడు కొండ దారుల మధ్య ఉన్న ఆసుపత్రులకు మందులను చేర్చడం ఇకపై చిటికెలో పని. పాడేరును హబ్ (ప్రధాన కేంద్రం) గా చేసుకుని, సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని పల్లెలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా కానున్నాయి. దీని కోసం ప్రముఖ సంస్థ “రెడ్ వింగ్” తో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ‘సూపర్ డ్రోన్ల’ ప్రత్యేకతలు ఇవే:
- కోల్డ్ చైన్ టెక్నాలజీ: మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేందుకు డ్రోన్లలో ప్రత్యేక శీతలీకరణ సదుపాయం ఉంటుంది.
- మల్టీ టాస్కింగ్: ఇవి కేవలం మందులు తీసుకెళ్లడమే కాదు.. తిరిగి వచ్చేటప్పుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు వేగంగా చేరవేస్తాయి.
- కెపాసిటీ: ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్తూ, గాలిలో దూసుకుపోతుంది.
- స్పీడ్ డెలివరీ: రోడ్డు మార్గంలో గంటల తరబడి పట్టే ప్రయాణాన్ని ఈ డ్రోన్లు నిమిషాల్లోనే పూర్తి చేస్తాయి.
మంచి వార్త: ఈ సంస్థ, మన రాష్ట్రంలో మొదటి 6-7 నెలల పాటు ఉచితంగా (Proof of Concept) సేవలు అందించడానికి ముందుకు రావడం విశేషం!
భవిష్యత్తు ప్రణాళిక: విశాఖ KGH నుండి పాడేరుకు..
ప్రస్తుతం పాడేరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభమవుతున్న ఈ సేవలు, త్వరలోనే విశాఖపట్నం కేజీహెచ్ (KGH) నుంచి పాడేరుకు మందుల రవాణా చేసేలా విస్తరించనున్నారు. అంటే, అత్యవసర రక్తం (Blood Units) కావాలన్నా, అత్యంత ఖరీదైన మందులు కావాలన్నా క్షణాల్లో పాడేరుకు చేరుకుంటాయి.

వచ్చే నెలాఖరు నుంచే ఈ డ్రోన్ల సందడి ప్రారంభం కానుంది. సాంకేతికతను సామాన్యుడి ప్రాణాలను కాపాడేందుకు వాడుతున్న ఈ ప్రయత్నం అభినందనీయం!