బిజెపి దొంగ ఓట్ల వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిన కాంగ్రెస్

భారత్ న్యూస్ విజయవాడ,విజయవాడ

Ammiraju Udaya Shankar.sharma News Editor…బిజెపి దొంగ ఓట్ల వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిన కాంగ్రెస్

ప్రజల నుంచి సేకరించిన సంతకాలను ట్రక్కు లో ఢిల్లీకి పంపిన నేతలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ట్రక్కును జెండా ఊపి ప్రారంభించిన వైయస్ షర్మిలా రెడ్డి

ఓట్ చోర్… గద్దీ చోర్ అంటూ నినాదాలు

వైయస్ షర్మిలా రెడ్డి

రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబ్ పేల్చారు

దొంగ ఓట్ల పై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారు

హర్యానాలో రెండు కోట్ల‌ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు అంట

ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారు

లక్షా 18 వేల ఓట్లు తేడాతో బిజెపి అధికారంలోకి వచ్చింది

25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బిజెపి అధికారంలొకి వచ్చింది

అంటే దొంగ ఓట్లు లేకుంటే బిజెపి కి అధికారం‌లేదు

హర్యానా లో‌కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలింది

సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయి

అయినా బిజెపి ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారు

ఎన్నికల సంఘం కూడా బిజెపి కి ఆర్.యస్.యస్ లాగా పని చేస్తుంది

బిజెపి అన్ని వ్యవస్థ లను ఇప్పటికే భ్రష్టు పట్టించింది

ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసింది

దేశంలో రాజ్యాంగ వ్యవస్థ లను నాశనం చేశారు

రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడటానికి పోరాటం చేశారు

దేశ వ్యాప్తంగా ఆయన పోరాటం చేస్తున్నారు

ఓటర్ల జాబితా డిజిటర్ రూపంలో ఇవ్వాలని కోరినా స్పందన లేదు

మహరాష్ట్ర లో అరవై లక్షల ఓట్లు సాయంత్రం ఒక్క గంటలో పాలయ్యాయి

వీటి కి సిసి‌ కెమెరాల ఆధారాలు లేకుండా చేశారు

కాంగ్రెస్ కు బలం ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఎక్కించారు

ఇలా అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బిజెపి అధికారంలోకి వచ్చింది

దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టాం

అన్ని రాష్ట్రాల సంతకాలను రామ్ లీల మైదానానికి తెస్తాం

అక్కడ నుంచి రాష్ట్రపతి కి వీటిని అంద చేస్తాం