జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయండి. *సి.ఆర్. ప్రెస్ అకాడమీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపి జర్నలిస్టుల సంక్షేమాణికికృషి చేయాలని విజ్ఞప్తి

భారత్ న్యూస్ విజయవాడ జూన్ 5:…జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయండి. *సి.ఆర్. ప్రెస్ అకాడమీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపి జర్నలిస్టుల సంక్షేమాణికికృషి చేయాలని విజ్ఞప్తి చేసినఏ.పీ.ఎం.పీ.ఏ.నాయకులు

ఏపీ సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గురువారం ఉదయం విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడమీ సమీపంలో ఉన్న సీఆర్ ప్రెస్ అకాడమీ లో సీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏ.పీ.ఎం.పీ.ఏ. నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల స్పందిస్తూ వారి సంక్షేమానికి నూతన సి.అర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కృషి చేయాలని కోరారు. గత కొంతకాలంగా జర్నలిస్టు సంక్షేమ పథకాలు ఆగిపోయి ఉన్నాయని వాటి పునరుద్ధరణకు తక్షణం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ మీడియా ప్రతినిధులు అందరికీ అక్రిడిటేషన్ సకాలంలో అందే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యేమినేని వెంకట రమణ, రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య,విజయవాడ సిటీ అధ్యక్షుడు తుళ్లూరి అనిల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విజయ్ బాబు,నగర నాయకులు రాజా, “అంతరాత్మ” శ్రీనివాసరావు,ప్రశాంత్, ఎన్.ఎస్.ఆర్.,డి కోటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొని ఎస్ అకాడమీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు.