భారత్ న్యూస్ నెల్లూరు….మోపిదేవి మండలం మోపిదేవి గ్రామపంచాయతీ పరిధిలోని గంజివానిపాలెం, గ్రామానికి చెందిన భూ సి దిలీప్ అనారోగ్య కారణం చేత గడిచిన కొద్దిరోజులు క్రితం కాలం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మోపిదేవి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మోపిదేవి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, రావి నాగేశ్వరరావు బూసి దిలీప్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు బూసి దిలీప్ మాతృమూర్తి అయిన బూసి నిర్మలకు, ఎనిమిది వేల రూపాయలు నగదు మరియు బి పి టి రైస్ బ్యాగులు మూడు, అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో కొక్కిలిగడ్డ సర్పంచ్ డిడ్ల జానకి రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు చందన్ రంగారావు, మోపిదేవి గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గుంటూరు నాగార్జున, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డోకిపర్తి బాలకోటేశ్వరావు, మోపిదేవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యురాలు బడుగు భారతి, కటారి, బడుగు హర్ష, కొండపల్లి శ్రీనివాసరావు, నీల రఘునాథం తదితరులు పాల్గొన్నారు.
